Alia Bhatt: బేబీ బంప్ తోనే ప్రమోషన్లలో బిజీగా ఉన్న అలియా!

  • September 4, 2022 / 03:26 PM IST

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ ఏడాది తాను ప్రేమించిన వ్యక్తి రణబీర్ కపూర్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఏప్రిల్ నెలలో వీరి వివాహం జరగగా పెళ్లయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించారు. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎంతో చురుగ్గా సినిమా షూటింగులలోను, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన

బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లు,ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరవుతూ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ కావడంతో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అలియా భట్ ఎంతో అట్రాక్షన్ గా నిలిచారు.

ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో తన బేబీ బంప్ తోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడంతో తనకు సినిమాపై ఉన్న డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది. ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఈమె గులాబీ రంగు డ్రెస్ ధరించి వచ్చారు.అయితే ప్రస్తుతం ఈ డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలియా భట్ స్వతహాగా తన డ్రస్సులను డిజైన్ చేయించుకుంటారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈమె ధరించిన గులాబీ రంగు డ్రెస్ పై అందరి దృష్టిలో పడింది. కొన్నిసార్లు బట్టలు కూడా మాట్లాడతాయి అనే విషయం ఈ డ్రెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అలియా డిజైన్ చేయించుకున్న డ్రెస్ పై ఏకంగా బేబీ ఆన్ బోర్డ్ అని ఉండేలా డిజైన్ చేయించుకున్నారు.ఈ విధంగా అలియా భట్ ధరించిన డ్రెస్ తోనే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పేశారు. ప్రస్తుతం ఈ డ్రెస్సు కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus