Jr NTR: ఆస్కార్ తర్వాత యంగ్ టైగర్ స్పీచ్ అలా ఉండబోతుందా?

  • March 16, 2023 / 01:50 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరు సామాన్య ప్రజల్లో సైతం మరింత ఎక్కువగా మారుమ్రోగుతోంది. కొన్ని నెలల క్రితం వరకు పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా తారక్ అంతకంతకూ ఎదుగుతున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకలావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కానున్నారు. విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ సినిమాలలో ఒకటి రెండు షాట్స్ లో అయినా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఉంటుంది.

ఆస్కార్ అవార్డ్ తర్వాత ఎన్టీఆర్ హాజరవుతున్న ఈవెంట్ కావడంతో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ స్పెషల్ గా ఉండనుందని ఆర్.ఆర్.ఆర్ గురించి షాకింగ్ విషయాలను తారక్ చెప్పనున్నారని తెలుస్తోంది.మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నాడంటూ రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఎన్టీఆర్ క్రేజ్ తో దాస్ కా ధమ్కీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా నివేదా పేతురాజ్ కనిపిస్తున్నారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కడం గమనార్హం. విశ్వక్ సేన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఈ సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని అనుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. విశ్వక్ ఒక్కో సినిమాకు 4.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus