లాక్ డౌన్ పెళ్లిల్ల లిస్టు లో జాయిన్ కాబోతున్న నయన్..?
July 23, 2020 / 09:30 AM IST
|Follow Us
నయన తార ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతీ వార్త కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె పెళ్లి మరియు పారితోషికం విషయాల పై వచ్చే వార్తలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి అనడంలో కూడా అతిశయోక్తి లేదు. గతంలో ఈమె కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అటు తరువాత హీరో కమ్ డైరెక్టర్ అయిన ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా వారితో బ్రేక్ అప్ అయిపోయింది నయన్.
గత కొన్నాళ్ళ నుండీ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయన్ సహజీవనం చేస్తూ వస్తుంది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై మాత్రం ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ లాక్ డౌన్ లోనే నయన్ పెళ్లి ఉండబోతుందని సమాచారం. కేరళలోని ఓ అమ్మ వారి గుడిలో నయన్ పెళ్లి జరగబోతుందని.. ఇందుకు సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయని సమాచారం.
అయితే నయన్ క్రిస్టియన్ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. మరి ఈమె పెళ్లి హిందూ సంప్రదాయం లో జరుగుతుందేంటి? అనే అనుమానాలు రావడం సహజం. అయితే రెండు పద్ధతుల్లోనూ ఈమె పెళ్లి జరుగాబోతుందట. అయితే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల కోరిక మేరకు మొదట హిందూ సంప్రదాయ పద్ధతిలో.. ఆ తరువాత క్రిస్టియన్ పద్దతిలో.. నయన్, విగ్నేష్ ల పెళ్లి జరుగాబోతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.