మరో పెళ్లి చేసుకోబోతున్న నటుడు ప్రభుదేవా.. షాక్ అవుతున్న ప్రేక్షకులు?

  • November 13, 2020 / 04:27 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్,హీరో, దర్శకుడు అయిన ప్రభుదేవా గతంలో రామలతా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరువాత అనుకోకుండా ప్రభుదేవా హీరోయిన్ నయనతారను ప్రేమించి ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇందుకు గాను మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడు. ఈ ఇష్యు పై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. కానీ ఎందుకో నయన్ తో కూడా ఇతను బ్రేకప్ అయ్యాడు.

దానికి అసలు కారణం ఏమయ్యుంటుందా అని చాలా డిస్కషన్లు జరిగాయి. ప్రభుదేవా మొదటి భార్య మాత్రం మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నయనతార పై మండిపడుతూనే ఉంది. అయితే ప్రభుదేవా ఈ విషయాలను ఏమీ పట్టించుకోకుండా తన మానాన తను.. హిందీ, తమిళ భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇంకా హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డాడని సమాచారం. తన బంధువుల అమ్మాయితోనే ప్రభుదేవా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడట.

ఆమె కూడా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందట. అయితే ప్రభుదేవా వయసు ఇప్పుడు 47సంవత్సరాలు. ఈ వయసులో పెళ్లేంటి అని కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘రాధే’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus