Premi Viswanath: ప్రేమీ విశ్వనాథ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే!

  • July 4, 2023 / 07:23 PM IST

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని అభిమనులకు దగ్గరైన వాళ్లలో ప్రేమీ విశ్వనాథ్ ఒకరు. ప్రేమీ విశ్వనాథ్ పలు సినిమాలలో కూడా చిన్నచిన్న పాత్రల్లో నటించినా సీరియళ్ల ద్వారా వచ్చిన స్థాయిలో సినిమాలలో ఆమెకు గుర్తింపు రాలేదు. కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై 1500కు పైగా ఎపిసోడ్లు ప్రసారమై సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ కు సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

అయితే తాజాగా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రేమీ విశ్వనాథ్ త్వరలో మరో కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రకటించారు. ప్రేమీ విశ్వనాథ్ మరో సీరియల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రేమీ విశ్వనాథ్ పారితోషికం రోజుకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలుగా ఉంది.

తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు, కన్నడ సీరియల్ నటీమణులను మించి ఈమె పారితోషికం తీసుకోవడం గమనార్హం. ప్రేమీ విశ్వనాథ్ సరైన పాత్రలను ఎంచుకుంటే మాత్రం ఆమె తిరుగుతుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమీ విశ్వనాథ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రేమీ విశ్వనాథ్ కు ఇతర ఛానెళ్ల నుంచి సైతం మంచి ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా. ప్రేమీ విశ్వనాథ్ నిరుపమ్ కాంబినేషన్ లో మరో సీరియల్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రేమీ విశ్వనాథ్ (Premi Viswanath) కార్తీకదీపం సీరియల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రేమీ విశ్వనాథ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రేమీ విశ్వనాథ్ తో సీరియల్ తీస్తే మంచి లాభాలు ఖాయమని నిర్మాతలు సైతం భావిస్తున్నారు. ప్రేమీ విశ్వనాథ్ తో పాన్ ఇండియా సీరియల్స్ తీయవచ్చని కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus