యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కంగారు పడుతున్నారు. రాధేశ్యామ్ పాన్ ఇండియా సినిమా కావడంతో భారీస్థాయిలో ప్రమోషన్స్ చేయని పక్షంలో నష్టాలు వస్తాయని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు మేకర్స్ తీపికబురు అందించారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్ లోడింగ్ అంటూ మేకర్స్ షాకింగ్ ప్రకటన చేశారు.
నవంబర్ 15వ తేదీన ఈ సాంగ్ రిలీజయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ కానున్న ఫస్ట్ సింగిల్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉండనుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా నుంచి మిగిలిన సాంగ్స్ కూడా వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ వచ్చే నెలలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న రాధేశ్యామ్ మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.
ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 70 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్ర, సీడెడ్ హక్కులు కూడా భారీస్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!