Siddharth, Aditi: అదితి – సిద్దార్థ్ ల పెళ్లి ఫిక్సట..!
February 4, 2023 / 02:25 PM IST
|Follow Us
అదితి రావ్ హైదరి అందరికీ సుపరిచితమే.సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ .. తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత ‘నవాబ్’ ‘అంతరిక్షం’ ‘వి’ ‘మహాసముద్రం’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే తర్వాత వచ్చిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
అయితే కొన్నాళ్లుగా ఈమె వార్తల్లో నిలుస్తుంది. ఈమె కొంతకాలంగా సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మహాసముద్రం’ సినిమా టైంలో ఈ జంట బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరికీ ఇదివరకు వేరే వాళ్ళతో పెళ్లై, విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ‘మహాసముద్రం’ మూవీ వీళ్ళ రిలేషన్ కు బాగా హెల్ప్ అయ్యింది. మొన్నామధ్య ముంబైలోని ఓ సెలూన్ వద్ద ఈ జంట మీడియా కంట పడింది.
అటు తర్వాత సోషల్ మీడియాలో సగం కన్ఫర్మ్ చేశారు. అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు శర్వానంద్ ఇంకాస్త కన్ఫర్మ్ చేశాడు. ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు వీరిద్దరూ కలిసి రావడంతో జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు… వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అని..! ఇక్కడ మాత్రమే కాదు ముంబై మీడియా కూడా అదితి గురించి ఇదే విధంగా స్పందిస్తుంది.
అయితే మొన్నామధ్య చేసిన ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో సిద్దార్థ్ ప్రస్తుతానికి రిలేషన్ లో ఉన్న మాట నిజమే కానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు అని చెప్పాడట. అయినా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!