‘అల్లరి నరేష్’ – ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి!

  • June 30, 2018 / 12:24 PM IST

హీరో “అల్లరి నరేష్”, నిర్మాత అనిల్ సుంకరల కాంబినేషన్‌లో ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి “నందిని నర్సింగ్ హోమ్” చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ”ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్” నిర్మించనున్న 15వ చిత్రమిది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యింది. సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చెయ్యలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ అల్లరి నరేష్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus