Allari Naresh: 20 ఏళ్ళ ఆదరణకి థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్.!
May 10, 2022 / 06:34 PM IST
|Follow Us
రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ చేసే హీరోలు కరువవుతున్న రోజులవి. దాదాపు ఇక ఎవ్వరూ లేరు అనుకుంటున్న టైంలో, 2002 మే 10న ‘అల్లరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. ఆ ఒక్క సినిమాతో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి రాజేంద్ర ప్రసాద్ ప్లేస్ ను రీప్లేస్ చేసాడు. స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గారి వారసుడు అనే బ్రాండ్ పడినా.. సొంత ట్యాలెంట్ తో పైకి వచ్చాడు నరేష్.
కామెడీ సినిమాలతో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నా.. వాటి పైనే ఆధారపడిపోలేదు మన నరేష్. ‘నేను’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘గమ్యం’ ‘మహర్షి’ ‘నాంది’ వంటి సినిమాల్లో తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ఇదిలా ఉండగా.. నిన్నటితో అంటే మే 10తో నరేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా నరేష్ తన 20 ఏళ్ళ జర్నీ గురించి అందరికీ థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ఆ లెటర్ ద్వారా నరేష్ స్పందిస్తూ.. ‘నా తోటి నటీనటులకు, కళాకారులకు, నా దర్శకులకు, నా నిర్మాతలకు, నా సాంకేతిక నిపుణులు, సిబ్బందికి -20 ఏళ్ళ నా నట జీవితంలో భాగమైన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.చిత్ర పరిశ్రమలోని ఉన్న నా స్నేహితులకు – నాకు స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ థాంక్స్.నా అభిమానులకు… మీ ఎనలేని ప్రేమ,విశ్వాసం, ఆదరణ వంటి వాటికి నేను రుణపడి ఉంటాను. వాటికి మీరు హద్దులు పెట్టలేదు.
నాపై అలాగే నా కుటుంబం పై, మీరు చూపిస్తున్న అభిమానం నాలో మరింత పట్టుదలను నింపుతూ వస్తుంది. ఈ రోజు నేను కన్న కలల్ని నెరవేర్చుకోగలుగుతున్నాను..20 ఏళ్ళ నట జీవితాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే అది మీ ఆదరాభిమానాలు వల్లనే.ప్రస్తుతానికి స్కోర్ కార్డ్ 59/20 అని ఉంది. మీ, నరేష్’ అంటూ పేర్కొన్నాడు అల్లరి నరేష్.