కామెడీ సినిమాలతో ఒకప్పుడు జెట్ స్పీడ్ లో లాభాలను అందుకున్న అల్లరి నరేష్ ఇటీవల వరుస అపజయాలతో కాస్త వెనుకబడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు చేసిన ఘనత ఈ హీరోది. ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతకు నష్టాలు వచ్చేది మాత్రం కాదు. కానీ గత ఐదేళ్ల నుంచి నరేష్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. నిన్న మొన్న పరిచయమైన హీరోలు కూడా సరికొత్త కథలతో ట్రెండ్ చేస్తుంటే నరేష్ మాత్రమే ఇంకా అదే ఫార్మాట్ లో వెళుతున్నాడనే కామెంట్స్ చాలానే వచ్చాయి.
అయితే మొత్తానికి నరేష్ తన ప్లాన్ చేంజ్ చేశాడు. నాంది సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. సస్పెన్స్ క్రైమ్ త్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక ఆ సినిమాకు ఇటీవల మంచి డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది. జీ టివి సంస్థ హొల్ సెల్ గా డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. నాంది సినిమా రిలీజ్ రైట్స్ ను అలాగే డిజిటల్ రైట్స్ ను 10కోట్లకు బేరం పెట్టినట్లు సమాచారం.
సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఇది కొంత లాభమే అని చెప్పవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో సినిమాను నిర్మించారట. చర్చలతో మరో కోటి అటు ఇటు కావచ్చు. ఇదివరకు సోలో బ్రతుకే సో బెటర్ హక్కులను కూడా మొత్తం కొనేసి విడుదల చేసుకున్న జీ ఛానెల్ అలాగే నాంది సినిమాను కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!