Allari Naresh: రైటర్ గా అల్లరి నరేష్ ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?
April 23, 2024 / 02:42 PM IST
|Follow Us
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా మారడానికి ముందు తన తండ్రి దివంగత ఇవివి సత్యనారాయణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అందుకే మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడంలో అతను సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి. అయితే కామెడీ హీరోగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లరి నరేష్.. కొన్నాళ్లుగా స్లో అయ్యాడు. ఎక్కువ సినిమాలు చేయడం లేదు. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ‘నాంది’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) ‘ఉగ్రం’ (Ugram) వంటి సినిమాల్లో చాలా సీరియస్ రోల్స్ పోషించాడు అల్లరి నరేష్.
అయితే అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే ‘సుడిగాడు’ (Sudigaadu) సినిమా అనే చెప్పాలి. ‘తమిజ్ పదమ్’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. పేరుకు తమిళ సినిమా రీమేక్ అయ్యుండొచ్చు కానీ.. ఇందులో వంద సినిమాలని స్పూఫ్ చేశారు. 2012 లో వచ్చిన ఈ సినిమా వర్కౌట్ అయిపోయింది కానీ జనాలు గుర్తుపెట్టుకునే రేంజ్లో ఈ సినిమా ఉండదు. అయితే 12 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన అల్లరి నరేష్ కి వచ్చింది.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ‘సుడిగాడు 2 ‘ కథని స్వయంగా అల్లరి నరేష్ రాసుకుంటున్నాడట. నిన్న జరిగిన ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) ట్రైలర్ లాంచ్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2025 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయని రివీల్ చేశాడు నరేష్. అయితే ‘రైటర్ గా కూడా అల్లరి నరేష్ సక్సెస్ అవ్వగలడా ?’ అనేది తెలియాల్సి ఉంది.