Allari Naresh, Pawan Kalyan: ఆ విషయంలో అల్లరి నరేష్ ఫస్ట్.. కానీ..?
June 22, 2021 / 10:21 AM IST
|Follow Us
గతేడాది, ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పెద్ద సినిమాలు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. థియేటర్లలో రిలీజై హిట్ టాక్ వస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది రిలీజైన సినిమాలలో బుక్ మై షోలో అత్యధిక రేటింగ్ తెచ్చుకున్న సినిమాల జాబితాలో అల్లరి నరేష్ నాంది మూవీ 92 శాతం రేటింగ్ తో మొదటి స్థానంతో నిలిచింది.
నరేష్ స్టార్ హీరో కాకపోయినా నాంది సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ స్థాయిలో రేటింగ్ తెచ్చుకుంది. అయితే నాంది సినిమా నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ 85 శాతం రేటింగ్ తో రెండో స్థానాన్ని సరిపెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల వకీల్ సాబ్ కు హిట్ టాక్ వచ్చినా కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోవడం గమనార్హం.
బుక్ మై షోలో 83 శాతం రేటింగ్ తో క్రాక్, జాతిరత్నాలు సినిమాలు మూడో స్థానంలో నిలిచాయి. నాగార్జున వైల్డ్ డాగ్, తేజ సజ్జా జాంబీ రెడ్డి 79 శాతం రేటింగ్ తో నాలుగో స్థానానికి పరిమితమయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఉప్పెన, సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలకు 77 శాతం రేటింగ్ వచ్చింది. ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 76 శాతం రేటింగ్ ను సాధించగా నితిన్ రంగ్ దే సినిమాకు 74 శాతం రేటింగ్ రావడం గమనార్హం. అల్లరి నరేష్ మొదటి స్థానంలో నిలిచి ఒక విధంగా పవన్ కు షాకిచ్చారని చెప్పాలి.