Allari Naresh, Nagarjuna: నాగార్జున నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్!

  • September 9, 2023 / 03:51 PM IST

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలన్నీ కూడా మల్టీ స్టార్ సినిమాలు గానే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా స్టార్ హీరోలు సినిమాలు చేస్తుంటే కనుక ఆ సినిమాలు తప్పకుండా టైర్ 2 హీరోలు కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో ఇలా యంగ్ హీరోస్ కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా నాగార్జున సినిమాలో నటుడు అల్లరి నరేష్ కూడా నటించబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నా సామిరంగా అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో మరొక యంగ్ హీరోకి కూడా అధిక ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో నటించడానికి దర్శక నిర్మాతలు అల్లరి నరేష్ ను అప్రోచ్ అయ్యారని సమాచారం. ఇక ఈ విషయం అల్లరి నరేష్ వద్దకు వెళ్లి తెలియజేయడంతో ఈయన ఏమాత్రం ఆలోచించకుండా నాగార్జున సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఈ సినిమాలో నటించడానికి నరేష్  (Allari Naresh) కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోయినప్పటికీ ఈయన డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. చిన్నప్పటినుంచి అక్కినేని నాగార్జునకు వీరాభిమానిగా ఉన్నటువంటి నరేష్ ఏకంగా ఆయన సినిమాలో ఆయనతో పాటు కలిసి నటించే అవకాశం రావడంతో ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో నరేష్ తన కెరియర్ పరంగా ఎంతో బిజీ అవ్వడమే కాకుండా ఇలా స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus