కామెడీ హీరోకి డైనమిక్ డైరెక్టర్ కావాలట

  • April 22, 2020 / 06:52 PM IST

టాలీవుడ్ లో కామెడీ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. కెరీర్ బిగినింగ్ నుండి తనపై కామెడీ హీరోగా ముద్ర వేసుకొని ఆ తరహా సినిమాలనే చేశాడు అల్లరి నరేష్. రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక ఆ స్థానం భర్తీ చేశారు అల్లరి నరేష్. 2002లో వచ్చిన అల్లరి సినిమాతో వెండి తెరకు పరిచమైన అల్లరి నరేష్ 18 ఏళ్ళ కెరీర్ లో 50కి పైగా సినిమాలలో నటించి రికార్డు సృష్టించాడు.

ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ విజయాల పరంగా వెనుక బడ్డాడు. ఆయన హిట్ అందుకొని చాలా ఏళ్ళు అవుతుంది. దీనితో గత ఏడాది మహర్షి సినిమాలో సెకండ్ హీరోగా సపోర్టింగ్ రోల్ కూడా చేశాడు. కాగా ఈ కామెడీ హీరోకి దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రంలో నటించాలని ఉందట. కెరీర్ లో చాల మంది దర్శకులతో పని చేశాను. నా ఫేవరేట్ దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు. అవకాశం వస్తే ఆయన సినిమాలో హీరోగా నటించాలని ఉంది, అన్నారు.

ఇక ఆయనకు ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు మణిరత్నం గారని అల్లరి నరేష్ చెప్పడం గమనార్హం. వరుసగా కామెడీ చిత్రాలు చేస్తుంటే వర్క్ అవుట్ కాకపోవడంతో అల్లరి నరేష్ ఫంధా మార్చారు. ఆయన నెక్స్ట్ మూవీ సీరియస్ స్టోరీతో రానుంది. నాంది అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటిమీద బట్టలు లేకుండా, తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఈ చిత్రం పై గంపెడు ఆశలు పెట్టుకున్న నరేష్, తనలోని కొత్త అవతారం చూస్తారు అంటున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus