Dilraju: ‘అది జరిగే పని కాదు’.. దిల్ రాజుకి అల్లు అరవింద్ సపోర్ట్!

  • November 19, 2022 / 05:40 PM IST

తెలుగు నిర్మాతల మండలి ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంక్రాంతికి తెలుగులో డబ్బింగ్ సినిమాలకు అనుమతి లేదని వెల్లడించింది. ఈ నిర్ణయం నిర్మాత దిల్ రాజుకి చిక్కు తీసుకొచ్చింది. విజయ్ హీరోగా ‘వరిసు’ అనే సినిమాను తెరకెక్కించారు దిల్ రాజు. మొదట ఈ సినిమాను బైలింగ్యువల్ అని చెప్పినప్పటికీ.. ఆ తరువాత డబ్బింగ్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అలానే ఈ సినిమాతో పాటు అజిత్ నటించిన ‘తునివు’ అనే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. అది కూడా సంక్రాంతికే రాబోతుంది. అయితే పొంగల్ రేసులో చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఉన్నాయి. రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఉన్నప్పుడు డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎలా ఇస్తారనేది..? నిర్మాతల మండలి ప్రశ్న. ఇదివరకు ఇదే డబ్బింగ్ సినిమాలను సంక్రాంతి, దసరాల సీజన్లలో విడుదల చేస్తే ఒప్పుకోమని దిల్ రాజు అన్నారు.

ఇప్పుడు ఆయనే సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుండడంతో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ప్రశ్నించగా.. ఆయన ఒక్క మాటలో సమాధానం చెప్పారు. బాలీవుడ్ సినిమా ‘భేడియా’ను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ని సంక్రాంతి రిలీజెస్ గురించి మీడియా ప్రశ్నించింది.

‘ఇండియన్ సినిమా ఒక్కటే అయిపోయిందని మీరు అంటున్న తరుణంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రాకూడదని నిర్మాతల మండలి అంటుంది. దానికి మీరేమంటారు..?’ అనే ప్రశ్నకు అల్లు అరవింద్ సింపుల్ గా ‘అది జరిగే పని కాదు’ అని బదులిచ్చారు. అంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రాకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు. మొత్తానికి అల్లు అరవింద్ తన సమాధానంతో దిల్ రాజుకి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus