సరైనోడు చిత్రం తర్వాత అనేక కథలు విన్న అల్లు అర్జున్ తమిళ డైరక్టర్ లింగుస్వామి చెప్పిన స్టోరీకి ఒకే చెప్పారు. ఆ కథతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అంతా ఒకే అయిపోయిందని అనుకునే లోపున హరీష్ శంకర్ ఎంటర్ అయ్యారు. అతనితో బన్నీ దువ్వాడ జగన్నాథం మూవీని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి మూవీ ఉంటుందని అందరూ భావించారు. అయితే డీజే తర్వాత రచయిత వక్కంతు వంశీ ని అల్లు అర్జున్ డైరక్టర్ గా పరిచయం చేయనున్నట్లు తెలిసింది. అతనితో ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అని సినిమాను చేయనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి నిర్మాతలు కూడా ఖరారు అయిపోయారు. లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబు సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయిందని టాక్. మరి లింగు స్వామి ప్రాజక్ట్ సంగతి ఏమైందని ఆరా తీయగా అసలు విషయం బయటికి వచ్చింది. డైరక్టర్ లింగుస్వామికి ఆ చిత్ర నిర్మాత జ్ఞాన్వేల్ రాజాకి మధ్య రెమ్యునరేషన్, షేర్ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయని, వాటిని సర్ది చెప్పడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కోలీవుడ్ వర్గాలు చెప్పాయి. దీంతో బన్నీ ఆ ప్రాజక్ట్ ని పక్కన పెట్టి వక్కంతు వంశీ కి ఒకే చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.