Allu Arjun: ‘గంగోత్రి’ బ్లాక్ బస్టర్ అయినా.. ఏడాది ఖాళీగా ఉన్నాను : అల్లు అర్జున్
May 8, 2024 / 04:24 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘డాడీ’ (Daddy) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) నటుడిగా మారాడు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది ‘గంగోత్రి’ (Gangotri) సినిమాతో. కే.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారి 100 వ సినిమాగా ఈ మూవీ రూపొందింది. 2003 వ సంవత్సరం మార్చి 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత కే.రాఘవేంద్ర రావు గారి మార్క్ పబ్లిసిటీ, సాంగ్స్ హెల్ప్ అవ్వడంతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఫైనల్ గా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
కానీ ఇందులో నటించిన హీరో, హీరోయిన్లకి పెద్దగా పేరు రాలేదు. అల్లు అర్జున్ కి మాత్రమే కాదు ఆర్తీ అగర్వాల్ (Aarthi Agarwal) చెల్లెలు అదితి అగర్వాల్ కి (Aditi Agarwal) కూడా ఇది మొదటి సినిమా. ఆమె కూడా ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని చూసిన వారంతా అతని లుక్స్ పై విమర్శలు గుప్పించారు. కానీ భవిష్యత్తులో ఇతను పాన్ ఇండియా స్టార్ అవుతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.
దానికి బీజం పడేలా చేసింది ‘ఆర్య’ సినిమా. నిన్నటితో ‘ఆర్య’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” ‘గంగోత్రి’ సినిమా బ్లాక్ బస్టర్ అయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాను. ఏడాది పాటు నేను ఖాళీగా ఉన్నాను. నేను మైనస్ 100 లో ఉన్న టైంలో ‘ఆర్య’ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
మా నాన్నగారు అల్లు అరవింద్ (Allu Aravind), చిరంజీవి గారు ఓకే చేస్తే తప్ప ఆ టైంలో నేను సొంతంగా సినిమా చేయలేని పరిస్థితి. అలాంటి టైంలో దిల్ రాజు గారు సుకుమార్ (Sukumar) అనే కొత్త దర్శకుడిని నా దగ్గరకు తీసుకొచ్చి ‘ఆర్య'(Aarya) కథ వినిపించారు. నాకు బాగా నచ్చింది. ఇది నాకు ఒక ‘ఇడియట్’ లాంటి సినిమా అవుతుందనే గట్ ఫీలింగ్ ఉంది. కానీ సుకుమార్ కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడా లేదా అని మా నాన్నగారికి ఓ టెన్షన్ ఉంది.
ఆ టైంలో వి.వి.వినాయక్ (V. V. Vinayak) గారు వచ్చి ‘ఆ కుర్రాడు బాగా తీయగలడు. అయినప్పటికీ మీకు డౌట్ ఉంటే నేను వచ్చి సినిమాని కంప్లీట్ చేస్తాను’ అనే భరోసా ఇచ్చారు.ఆ అవసరం రాకుండానే సుకుమార్ అద్భుతంగా ‘ఆర్య’ ని తీశారు. నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ ‘ఆర్య’ సినిమా ” అంటూ చెప్పుకొచ్చాడు.