అల వైకుంఠపురంలో మూవీ విజయం అల్లు అర్జున్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురంలో బన్నీ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. దీనితో అల్లు అర్జున్ పుష్ప మూవీని పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. నిజానికి పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనే ఆలోచన చిత్ర ప్రారంభంలో లేదు. చిత్ర ప్రకటన సమయంలో కూడా ఇది పాన్ ఇండియా చిత్రంగా దర్శక నిర్మాతలు చెప్పలేదు. ఫస్ట్ లుక్ విడుదల రోజు సడన్ గా నాలుగు భాషలలో పోస్టర్స్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
కానీ బాలీవుడ్ లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఇప్పటికే చాలా మంది సౌత్ హీరోలు ప్రయత్నించి వదిలేశారు. రజని, కమల్ వంటి వాళ్ళు మాత్రమే అక్కడ కూడా తమ సినిమాలకు మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఇక గత ఐదేళ్లుగా ప్రభాస్ బాలీవుడ్ లో ఆధిపత్యం చలాయిస్తున్నారు. బాహుబలి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సాహో విజయంతో, ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు బన్నీకి చెందిన ఒక్క చిత్రం కూడా బాలీవుడ్ లో విడుదల కాలేదు.
అయినా బన్నీధైర్యం చేయడానికి కారణం అల వైకుంఠపురంలో మూవీతో వచ్చిన ఇమేజ్ అని తెలుస్తుంది. ఈ మూవీ విడుదల తరువాత బన్నీ సాంగ్స్, డాన్సులుగురించి బాలీవుడ్ సెలెబ్రిటీలు మాట్లాడుకున్నారు. ఆ విధంగా బన్నీ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యింది. దానితో పాటు బన్నీ హిందీ వర్షన్ చిత్రాలు కొన్ని యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకున్నాయి. దీనితో ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్ముతున్నాడట.
Most Recommended Video
40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?