ఏ హీరో అయినా కథ విన్న తరువాతే ప్రాజెక్టు సెట్ చేసుకుంటాడు. అయితే మన అల్లు అర్జున్ మాత్రం చాలా డిఫరెంట్. అతని దగ్గరకి ఎంతో మంది దర్శకులు కథలు పట్టుకుని వెళ్తుంటారు.. కానీ ఈ మధ్యన అతను అందరికీ ఛాన్స్ లు ఇవ్వడం లేదు . ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) అలాగే మారుతీ, వి.ఐ.ఆనంద్, సందీప్ రెడ్డి వంగా వంటి ఎంతో మంది దర్శకులు బన్నీ చుట్టూ కథలు పట్టుకుని చక్కర్లు కొట్టారట. కానీ వారెవ్వరినీ ఓకే చెయ్యలేదట. అయితే స్టార్ డైరెక్టర్లను మాత్రం కథ లేకపోయినా ఓకే చేసేస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
నిజానికి ‘అల వైకుంఠపురములో’ చిత్రం మొదలు పెట్టడానికి ముందు త్రివిక్రమ్ దగ్గర కథే లేదట. ఎన్నో కథలు అనుకున్నారు.. మధ్యలో ఓ హిందీ రీమేక్ చేద్దామా అనే డిస్కషన్లు కూడా నడిచాయి. అలా కథ కోసమే 4 నెలల వరకూ టైం తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు సుకుమార్ తో ‘పుష్ప’ చేస్తున్న బన్నీ.. ముందుగా కథ వినలేదట. కానీ పాన్ ఇండియా ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. తాజాగా అనౌన్స్ చేసిన కొరటాల శివ ప్రాజెక్టు కు సంబంధించి కూడా కథ రెడీగా లేదట.
కేవలం లైన్ మాత్రమే కొరటాల దగ్గర ఉందట. అది వినే ప్రాజెక్టుని బన్నీ ఓకే చేశాడని సమాచారం. ‘ఏమైనా డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో బన్నీ సినిమాలు ఛాన్స్ లు ఇవ్వడం బాగానే ఉంది కానీ.. కేవలం స్టార్ డైరెక్టర్స్ ను మాత్రమే కాకుండా.. తన దగ్గరకు కథలు పట్టుకొచ్చే మీడియం రేంజ్ డైరెక్టర్స్ ను కూడా కనికరిస్తే ఇంకా బాగుంటుంది’ అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?