స్టార్ డైరక్టర్ చెప్పిన కథ నచ్చలేదన్న అల్లు అర్జున్!
April 13, 2017 / 06:46 AM IST
|Follow Us
సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చేస్తున్న బన్నీ.. దీని తర్వాత రచయిత వక్కంతం వంశీని డైరక్టర్ గా పరిచయం చేస్తున్నారు. ఆయన దర్వకత్వంలో ” నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా” అనే మూవీ చేయనున్నారు. లింగు స్వామి తో కూడా మరో ప్రాజక్ట్ లైన్లో ఉంది. అయితే శ్రీను వైట్ల కథను సిద్ధం చేసి బన్నీకి రీసెంట్ గా వినిపించినట్లు తెలిసింది. ఆ స్టోరీని విన్న అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
కథలో కొత్తదనం లేకపోవడంతో అల్లు అర్జున్ పక్కన పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఆయన గత చిత్రాలు ఆగడు, బ్రూస్లీ సినిమాలు ఫెయిల్ కావడంతో మిస్టర్ సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నారు శ్రీను వైట్ల. ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. సినిమా ఫలితం కంటే ముందే సినిమాను ఒకే చేయాలనీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక మిస్టర్ హిట్ కొడితే శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి హీరోలు ముందుకు వస్తారు. లేకుంటే మరో సినిమా చేయడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.