‘సరైనోడు’ – సరికొత్త “సెన్సేషన్”

  • March 11, 2016 / 10:34 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’.బోయపాటి సినిమా అంటేనే యాక్షను పెట్టింది పేరు, అలాంటిది అలాంటి దర్శకుడికి సరైన హీరో దొరకాలే కానీ దుమ్ము దులిపెయ్యడు. అవును నిజమే బన్నీ-బోయపాటిది సరికొత్త కాంబినేషన్. అయితే ఈ కాంబినేషన్ లో చాల్ థ్రిల్ ఉంది అంటున్నాడు దర్శకుడు.

ఇంతకీ విషయం ఏమిటంటే..బోయపాటి శీను సినిమాలంటేనే బోలెడన్ని ఎమోషన్స్ తో పాటు ఎంతో గ్రాండ్ గా ఉంటాయి. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేస్తాడు అలాంటిది వీటన్నింటికీ తోడు..విజువల్స్ పరంగా కూడా అత్యంత ఆకర్షణీయంగా సినిమా తెరకెక్కిస్తే భలే ఉంటుంది కదా. అవును అసలు కధ అదే…సరైనోడు సినిమా విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడు. ఇప్పటివరకూ తెలుగు ఆడియన్స్ చూడని లొకేషన్స్ ను తెరపై చూపించి థ్రిల్ చేయాలని డిసైడ్ అందుకే షూటింగ్ పార్ట్ దాదాపు ఫినిష్ చేసుకుని పాటలకు. బొలీవియ వెళ్లారు.

అభిమానుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించే క్రమంలో ఈ చిత్రాన్ని చాలా పగడ్బందీగా తీస్తున్నాడు దర్శకుడు. బొలివీయా లొకేషన్స్ ను షేర్ చేస్తానన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా చెయ్యవద్దు అని దర్శకుడు చెప్పినట్లు సమాచారం. పాటలు – ఫైట్లు మాత్రమే కాకుండా.. నిర్మాణ పరంగా కూడా విజువల్ ట్రీట్ లా సరైనోడు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కాకుండా తెరెకెక్కిసున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం కావడంతో.. బడ్జెట్ విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ లేవనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుందో చూడాలి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus