సరైనోడు ‘కధ’ లీక్ అయ్యిందా??

  • March 1, 2016 / 07:31 AM IST

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టైలిష్ స్టార్ బన్నీతో కలసి చేస్తున్న సినిమా ‘సరైనోడు’. ఈ చిత్రం షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న ఈ చిత్రం కధ లీకైనట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మొత్తానికి లీక్ అయిన కధ మాత్రం ఇదే….’జులాయి’గా తిరిగే కుర్రాడు బన్నీ, అయితే తండ్రి మరణానంతరం, సింపతీతో ఎమ్మెల్యే అవుతుంది హీరోయిన్ కేథరన్, కేథరన్ ను చూసిన బన్నీ తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.
ఆమె వెంటపడతాడు… ఎందుకు నా వెంట పడుతున్నావ్ అని ఆరా తీస్తే…తనదైన శైలిలో రివర్స్ సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఇలా కధ సో..సో..గా..సాగి పోతూ ఉండగా…

రకుల్ ప్రీత్ సింగ్ కు ఒక కధ ఉంటుంది. అదేమిటంటే….విలన్ వల్ల ఆమె సొంత వారిని, ఊరి వారిని కోల్పోతుంది. హీరో పుణ్యమా అంటూ ఆమె బ్రతుకుతుంది.. నిజానికి ఆ ఇద్దరికి చిన్న ఫ్లాష్ బ్యాక్ పరిచయం..పెళ్లి చూపుల్లాంటిది వుంటుంది. రకుల్ ను కాపాడిన హీరో..తాను ఆమె కోసమే వచ్చినట్లు, ఆమె పగకు ప్రతీకారం తీర్చుకుంటానని …రకుల్ నా మనిషి అని అన్న ట్వీష్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో పడుతుందని తెలుస్తుంది.

ఇక ఆ తరువాత రెండో భాగంలో విలన్ అయిన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఆదితో హీరో బన్నీ ఢీ అంటే ఢీ అనడం మధ్య నడుస్తుంది.ఇక్కడ చిన్న సస్సెన్స్ లేదా ట్విస్ట్ వుంటుందని వినికిడి. అయితే సినిమా కధ కొంచెం కన్‌ఫ్యూసింగ్ ఉన్నా అక్కడ దర్శకుడు బోయపాటి కాబట్టి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇక ఈ కధ పెద్ద కొత్తగా ఏమీ లేదు, అక్కడక్కడా భద్ర ఛాయలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus