Allu Ayaan: షార్ట్‌ వీడియోలో వీటిని గమనించారా..!

  • November 9, 2021 / 11:24 AM IST

అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ వీడియో ఒకటి రిలీజ్‌ చూశారా?. వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమా ప్రచారం కోసం ఇటీవల విడుదల చేసిన ‘గని యాంథమ్‌’ను అయాన్‌తో వీడియోగా రూపొందించారు ఆ సినిమా నిర్మాత, అయాన్‌ పెదనాన్న అయిన అల్లు బాబీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ… బన్నీ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ యాంథమ్‌లోలానే అయాన్‌… జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియోలో కొన్ని ఆసక్తికర అంశాలను మనం చూడొచ్చు.

ఆ వీడియో బ్యాగ్రౌండ్‌లో కొన్ని ఫొటోలు కనిపిస్తాయి. అవి భలే ఇంట్రెస్టింగ్‌ ఉన్నాయి కూడా. వీడియోలో చాలాసార్లు మనకు AA లోగో కనిపిస్తుంది. అంటే ఈ వీడియో అల్లు అర్జున్‌ పర్సనల్ జిమ్‌లో అయినా తీసుండాలి, లేదంటే వేరే జిమ్‌లో తీసేటప్పుడు వెనుక లోగో వచ్చేలా చేసుండాలి. తొలి పాయింట్‌కే ఆస్కారాలు ఎక్కువ. ఇక కీలకమైన అంశాలు వీడియోలో కనిపించే ఫొటోలు. అల్లు అర్జున్‌ బాగా ఆరాదించే ముగ్గురు స్టార్లు ఈ వీడియోలో మనకు కనిపిస్తారు.

ఒకరు మెగాస్టార్‌ చిరంజీవి అయితే, ఇంకో ఇద్దరు బ్రూస్‌లీ, మైఖేల్‌ జాక్సన్‌. బన్నీకి ఈ ముగ్గురు అంటూ బాగా ఇష్టమని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిని చూస్తూ, ఆరాదిస్తూనే ఇంతవరకు వచ్చాడు. ఇప్పుడు తన మార్కు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదన్నమాట మేటర్‌.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus