Pushpa Movie: పుష్పలో సునీల్ రోల్ అలా ఉండనుందా?

  • July 3, 2021 / 05:35 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ కస్తూరి రష్మిక మందన్నా హీరోయిన్ గా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కమెడియన్ రోల్స్ లో ఎక్కువగా నటించి ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్న సునీల్ పుష్ప మూవీలో మాత్రం విలన్ రోల్ లో కనించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కలర్ ఫోటో మూవీలో విలన్ పాత్ర చేసి సునీల్ మెప్పించారు.

ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో పుష్ప తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ లో మెయిన్ విలన్ సునీల్ అని తెలుస్తోంది. సునీల్ భార్య పాత్రలో జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ అనసూయ నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రతో సునీల్ మెప్పిస్తే ఇతర స్టార్ హీరోల సినిమాల్లో సైతం సునీల్ కు విలన్ గా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఆగష్టు 13వ తేదీన ఇండిపెండెన్స్ డే కనుకగా పుష్ప మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీకి సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. సినిమాలో మెయిన్ విలన్ అయిన ఫహద్ ఫాజిల్ పుష్ప పార్ట్ 1 ప్రీ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించగా పుష్ప మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ను సాధిస్తారేమో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus