సునీల్ కు అల్లు పురస్కారం ప్రదానం చేసిన అల్లు అర్జున్

  • August 22, 2018 / 07:59 AM IST

తెలుగు సినిమా రంగంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్యకి ప్రత్యేక స్థానం ఉంది. హాస్య నటుడిగానే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగానూ అతను అభినందనలు అందుకున్నారు. అందుకే అల్లు రామలింగయ్య కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి ఏడాది జాతీయ పురస్కారాన్ని సినీ రంగంలో విశేష సేవలందించిన వారికి అల్లు కుటుంబసభ్యులు అందిస్తున్నారు. ఇదివరకు కోట శ్రీనివాసరావు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. తాజాగా ఈ అవార్డునుకు హాస్యనటుడు సునీల్ ఎంపికయ్యారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు.

మెగాస్టార్ 63 వ పుట్టినరోజు వేడుకల్లో అల్లు రామలింగయ్య అవార్డును సునీల్ కు అల్లు అర్జున్ బహుకరించారు. తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగిన కమెడియన్లలో అల్లు రామలింగయ్య ఒకరని గత 14 సంవత్సరాలుగా ఈ అవార్డును అందిస్తున్నట్టు అల్లు అర్జున్ పేర్కొన్నారు. అల్లు రామలింగయ్య అవార్డును మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అందుకోవడం మరిచిపోలేనిది కమెడియన్ హీరో సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, మెగాస్టార్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus