శిరీష్ ఫ్లాప్ సినిమా తెలుగులో ఎందుకు రిలీజ్ చేస్తున్నట్లు
February 22, 2018 / 05:54 AM IST
|Follow Us
సాధారణంగా ఏదైనా వేరే భాషలో సూపర్ హిట్ కాకపోయినా కనీస స్థాయిలో ఆడిన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తుంటారు. ఒక్కోసారి రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరో ఇమేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు కొన్ని సినిమాలను డబ్బింగ్ చేస్తుంటారు. అయితే.. విచిత్రంగా స్టార్ ఇమేజ్ మాత్రమే కాక రిజల్ట్ తోనూ సంబంధం లేకుండా మలయాళంలో ఆల్రెడీ అయిదారు నెలల క్రితం విడుదలై కనీస స్థాయి విజయాన్ని సైతం నమోదు చేయలేక బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లాపడిన ఒక మామూలు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మిలటరీ యుద్ధం నేపధ్యంలో తెరకెక్కిన “1971” చిత్రాన్ని “యుద్ధ భూమి”గా తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.
అల్లు శిరీష్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అతడి కోసమే తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్లు ఉంది. ఇటీవల విడుదలైన “ఒక్క క్షణం” బాగుందని మౌత్ టాక్ వచ్చినా.. ఆ టాక్ కలెక్షన్స్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే.. శిరీష్ మరో సినిమాకి సైన్ చేయకపోవడంతో.. మరీ ఎక్కువ గ్యాప్ ఉండకూడదని భావించి అల్లు అరవింద్ దగ్గరుండి మరీ “యుద్ధ భూమి” చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయిస్తున్నాడని వినికిడి. మరి మలయాళంలోనే సరిగా ఆడని చిత్రం, కేవలం అల్లు శిరీష్ కోసం తెలుగులో ఆడుతుందా అని ట్రేడ్ వర్గాల అనుమానం.