అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం

  • April 28, 2016 / 12:44 PM IST

అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించనున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిప్ర‌ముఖుల స‌మ‌క్షంలో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న రెండో తెలుగు సినిమా ఇది.
ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్ సభ్యులను అభినందించారు. తొలి సన్నివేశానికి మాస్ డైరెక్టర్ బోయపాటిశ్రీను క్లాప్ కొట్టగా, స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…..

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘’శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. డైరెక్టర్ ఎం.వి.ఎన్. రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో బన్ని అనే సినిమాను నిర్మించారు. డైరెక్టర్ ఎం.వి.ఎన్ రెడ్డితో నాకు చిన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్ చూస్తున్నారు. డైలాగ్ వెర్షన్ వర్క్ జరుగుతుంది. సాధారణంగా నేను ప్రతి సంవత్సరం 20-30 కథలు వింటుంటాను. కానీ ఈ కథను సింగిల్ సిటింగ్ లోనే ఓకే చేసేశాను. ఇలాంటి రోల్ చేయాలని ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను. కామెడి, పెర్ ఫార్మెన్స్ కలగలిసిన క్యారెక్టర్.

నాన్నగారు కూడా కథను సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశారు. లవ్ ఎంటర్ టైనర్, అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స ఉండే చిత్రం. ఈ సినిమా కోసం వర్కవుట్ చేయాలి. శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఈ సినిమా జులై నుండి సెట్స్ మీద‌కి వెలుతుంది’’అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఎస్.శైలేంద్రబాబు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తర్వాత వస్తున్న రెండో తెలుగు సినిమా. మా బ్యానర్ లో పద్దెనిమిదో సినిమా. దర్శకుడు మంచి కథను అందించారు. అల్లు శిరీష్ గారికి థాంక్స్. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తరహాలో ఈ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన హరీష్ దుగ్గిశెట్టి మాట్లాడుతూ ‘’శిరీష్ బాడీ లాంగ్వేజ్ కు తగిన కథ. ఫుల్ ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది’’ అన్నారు.

చిత్ర దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ ‘’మంచి లవ్ ఎంటర్ టైనర్.తో పాటు మంచి కాన్సెప్ట్ స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ వున్న క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాము. బేసిక్ గా నాకు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే న‌చ్చుతాయి. ధియోట‌ర్ కి వెల్లి 100 రూపాయిల టికెట్ కొని చ‌క్క‌గా న‌వ్వుకుని, ఎంజాయ్ చేసి మాత్ర‌మే బ‌య‌ట‌కి రావాలి అనుకునేవాడిని కాబ‌ట్టి నా చిత్రం కూడా ఏ ప్రేక్ష‌కుడు చూసినా కూడా అదే ఎంజాయ్‌మెంట్ తో బ‌య‌ట‌కి రావాలి అనుకుంటాను. అలాంటి మంచి క‌థ నాకు వ‌చ్చింది. అలాగే ఈ క‌థ‌కి ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారు సింగిల్ సిట్టింగ్ః లో అంగీక‌రించి ఆశీర్వ‌దించారు. అర‌వింద్ గారికి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. జూలై మొదటి వారం నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. అల్లు శిరీష్ కి యాప్ట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా డైరెక్షన్ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా మిత్రుడు, హీరో శిరీష్ కి, నిర్మాత‌లకి మా యూనిట్ అంద‌రికి థాంక్స్. మీడియా సోద‌రులంద‌రికి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. మీ స‌పోర్ట్ మా చిత్రం చివ‌రి వ‌ర‌కూ వుండాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను ’’ అన్నారు.

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.వో: ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కో డైరెక్టర్: రాధాకృష్ణ పూసల, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, ఆర్ట్: బ్రహ్మ కడలి, మ్యూజిక్: జిబ్రాన్, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: ఎం.వి.ఎన్.రెడ్డి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus