Allu Arjun: తన భర్త ఫేవరెట్ ఫుడ్ అదేనంటున్న స్నేహా రెడ్డి..!
April 25, 2022 / 02:42 PM IST
|Follow Us
అల్లు అర్జున్ ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తో ప్రారంభమైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం సక్సెస్ సాధించింది. ఇప్పుడు ‘పుష్ప’ కి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్ 2’ లా ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అతి త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్ ను మొదలుకానుంది. పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ త్వరలో రానుందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ను కలిగి ఉందన్న సంగతి తెలిసిందే.
తన కొత్త ఫోటోలు అలాగే తన పిల్లల కొత్త ఫోటోలను షేర్ చేస్తూనే తన భర్తతో దిగిన స్టైలిష్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ సెషన్ ను నిర్వహించింది.ఈ క్రమంలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఈమె సమాధానమిచ్చింది. ‘మీ ఫేవరెట్ కలర్ ఏంటి?’ అనే ప్రశ్నకి ‘రెడ్’ అని, ‘మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి?’ అనే ప్రశ్నకి ‘లండన్’ అని .
‘అల్లు అయాన్, అర్హలలో ఎవరు నాటీ?’ అనే ప్రశ్నకి .. ‘అయాన్’ అని జవాబులిచ్చిన ఈమె అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ ఏంట? అనే విషయాన్ని కూడా రివీల్ చేసింది. ‘అల్లు అర్జున్ కు బిర్యాని అంటే చాలా ఇష్టమని’ ఈమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన పిల్లల ఫోటోలను కూడా షేర్ చేసింది.