నాగార్జున, వర్మ చిత్రం గురించి అమల ఏమి చెప్పిందంటే ?
June 1, 2018 / 01:52 PM IST
|Follow Us
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గదు. అటువంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఆఫీసర్. పాతికేళ్ళక్రితం శివ సినిమాతో సంచలనం సృష్టించిన నాగార్జున, వర్మ లు మరోసారి చరిత్ర సృష్టిస్తారని అభిమానులు ఎదురుచూసారు. నేడు రిలీజ్ అయిన ఆఫీసర్ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని సినీ విశ్లేషకులు చెప్పారు. మిశ్రమస్పందన అందుకుంటున్న ఈ సినిమాపై నాగార్జున భార్య అమల ట్విట్టర్ వేదికపై అభిప్రాయాన్ని వెల్లడించింది. “అద్బుతమైన నటన. అద్భుతమైన చిత్రం” అంటూ ప్రశంసలు కురిపించింది. “నో నాన్సెన్స్ – కరెక్ట్ గా చెప్పిన కథ.
సినిమాలో సౌండ్ సీటు నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. మొత్తానికి సినిమా అన్ని విధాలా ఆకట్టుకుంది. అందుకు గాను మై స్వీట్ హార్ట్ నాగార్జునకు అండ్ ఆఫీసర్ సినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసింది. అమల ట్వీట్ వర్మకి ఆనందాన్ని కలిగించింది. ఆ విషయాన్ని రీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. అలాగే అమలకి థాంక్స్ చెప్పారు. వర్మ స్వయంగా నిర్మించిన ఈ మూవీ విజయానికి అమల ట్వీట్ ఎంతమేర దోహదహపడనుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం నాగార్జున శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు.