చారిత్రాత్మక చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన అమలా పాల్!

  • May 4, 2019 / 01:32 PM IST

‘బెజవాడ’ ‘నాయక్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించింది అమలా పాల్. అయితే ఈ చిత్రాలు అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. సో తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వడాన్ని డిసైడయ్యి… తమిళ చిత్రాల పైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అయితే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్ ను పెళ్ళి చేసుకుని సినిమాలు కాస్త తగ్గించింది. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ తో డైవర్స్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది.

ఈ నేపథ్యంలో ఒక భారీ చారిత్రక చిత్రంలో నటించడానికి కూడా రెడీ అయ్యింది. ఈ చిత్రంలో ఈమె పాత్ర కూడా కీలకమని తెలుస్తుంది. రాజ రాజ చోళునికి సంబంధించిన కథను ‘పొన్నియిన్ సెల్వన్’ అనే టైటిల్ తో మణిరత్నం రూపొందించనున్నాడు. ‘జియో స్టూడియోస్’ తో కలిసి మణిరత్నం కూడా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. ఈ చిత్రం కోసం పెద్ద స్టార్ క్యాస్ట్ నే ఎంచుకున్నాడు. అమితాబ్ .. కార్తీ .. విజయ్ సేతుపతి .. జయం రవి .. ఐశ్వర్యరాయ్ .. అనుష్క .. కీర్తి సురేశ్ వంటి బడా స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక మరో కీలక పాత్ర కోసం అమలా పాల్ ను తీసుకున్నారని తెలుస్తుంది. ఆగస్టు నుండీ ఈ చిత్రం మొదలుకానుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus