Amala: మనుషులు తప్పు చేశారని మానవజాతిని శిక్షిస్తామా?
March 1, 2023 / 07:00 PM IST
|Follow Us
ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పెట్ పరిధిలో వీధి కుక్కల దాడిలో 5 సంవత్సరాల బాలుడు మృతి చెందిన విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. దీంతో ఈ ఘటనపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు కూడ ఈ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ GHMC వెంటనే చర్యలు తీసుకోవాలని పోస్ట్ షేర్ చేశాడు.
ఇక ఈ ఘటనపై యంకర్ రష్మి స్పందిస్తూ… మూగ జీవాలను శిక్షించడం తప్పని,వాటికి షల్టర్ కల్పించాలని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా హీరో నాగార్జున భార్య అక్కినేని అమల కూడా ఈ ఘటనపై స్పందించినట్లు తెలుస్తొంది. బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నుర్వహిస్తున్న అమల మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన అమల ఈ ఘటనపై స్పందించినట్లు తెలుస్తొంది.
ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ ” బాలుడు మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కుక్కలను శత్రువులుగా చూడొద్దని అందరిని కోరినట్టు తెలుస్తోంది. ఒక మనిషి తప్పు చేస్తే అందరిని శిక్షిస్తామా? అలాగే ఒక కుక్క చేసిన తప్పుకు అన్ని కుక్కలను శిక్షించడం కరెక్ట్ కాదని ఆమె తెలిపింది. కుక్కలు ఎప్పుడు మనుషుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. మనల్ని ప్రేమిస్తూ ఎప్పుడు మనకి రక్షణగా ఉంటాయి. ” అని అమల స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం గురించి సురేఖ వాణి కూతురు సుప్రిత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. అయితే అమల ఇలా స్పందించిందో ? లేదో ? తెలియదు కానీ కొందరు మాత్రం అమల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నటి సురేఖ వాణి సుప్రీత కూడా పెట్ లవర్స్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుప్రీత చేసినటువంటి ఈ పోస్టు వైరల్ అవుతుంది.