ఘనంగా జరిగిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్దీప్ పెళ్లి.. వైరల్ అవుతున్న వైరల్..!
December 14, 2022 / 08:31 PM IST
|Follow Us
‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్దీప్ చౌదరి.. ‘కోయిలమ్మ’ ఫేమ్ తేజస్విని గౌడ చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు అనగా డిసెంబర్ 14న వీరి వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అంతేకాదు కొద్దిపాటి బుల్లితెర నటీనటులు కూడా వీరి పెళ్ళికి విచ్చేసి తమ బెస్ట్ విషెస్ ను చెప్పారు. మరోపక్క రిసెప్షన్ కు కూడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అమర్దీప్- తేజస్విని ల పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :