Amardeep: బిగ్ బాస్ విన్నర్ కాలేదనే బాధ ఉందన్న అమర్ దీప్.. అక్కడ గెలిచానంటూ?

  • December 19, 2023 / 04:31 PM IST

బిగ్ బాస్ షో ద్వారా అమర్ దీప్ ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్7 లో రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. అమర్ దీప్ మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో శివాజీ వల్లే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని జరుగుతున్న ప్రచారం ఏ మాత్రం నిజం కాదని అన్నారు. పల్లవి ప్రశాంత్ సొంతంగా ఆడి గెలిచాడని శివాజీ అన్న సపోర్ట్ ఇచ్చాడని అమర్ దీప్ పేర్కొన్నారు.

శివాజీ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశారని ఎక్కడ ఎలా ఉండాలో శివాజీకి తెలుసు కాబట్టి మైండ్ గేమ్ తో యావర్, ప్రశాంత్ లకు సపోర్ట్ ఇచ్చాడని అమర్ దీప్ చెప్పుకొచ్చారు. అంతే కానీ శివాజీని అంతకు మించి మెచ్చుకోవాల్సిన అవసరం లేదనే అర్థం వచ్చేలా అమర్ దీప్ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో 80 కెమెరాలు ఉన్నాయని ప్రతి టాస్క్ లో ఆ కెమెరాలు మనల్ని చూస్తుంటాయని అమర్ దీప్ వెల్లడించారు.

బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు ఉన్నాయనే ఆలోచన లేదని అమర్ దీప్ తెలిపారు. ఐదు వారాలకే బిగ్ బాస్ హౌస్ లో మిగతా వాళ్లతో పడలేనని వెళ్లిపోవాలని అనిపించిందని అమర్ దీప్ కామెంట్లు చేశారు. రవితేజ అంటే పిచ్చి అని ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అమర్ దీప్ పేర్కొన్నారు. రవితేజ సినిమా ఛాన్స్ అని చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయిందని అమర్ దీప్ అన్నారు.

ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరూ సమానమే అని బిగ్ బాస్ షోలో ఇక్కడివరకు వచ్చానని అదే సంతోషమని అమర్ దీప్ తెలిపారు. పల్లవి ప్రశాంత్ గెలిచాడనే రీగ్రెట్ లేదని నేను బిగ్ బాస్ విన్ కాలేదనే బాధ ఉంది కానీ ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచానని అమర్ దీప్ అన్నారు. నన్ను ఓట్లు వేసి గెలిపించిన అందరి దృష్టిలో నేను గెలిచానని ఆయన పేర్కొన్నారు. (Amardeep) అమర్ దీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus