Amardeep Wife Tejaswini: ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసిరిన తేజస్విని!
December 11, 2023 / 03:29 PM IST
|Follow Us
బిగ్ బాస్ సీజన్ -7 లో కామన్ మెన్ మరియు రైతు బిడ్డ ట్యాగ్ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించకపోయిన కూడా ‘రైతు బిడ్డ’ ట్యాగ్ తో ఇతను చేసిన వీడియోస్ కి సోషల్ మీడియాలో మంచి వ్యూస్ రావడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సీరియల్ కంటెస్టెంట్స్ అందరికంటే ముందుగానే మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు.
హౌస్ లోకి అడుగుపెట్టకముందే అందరూ ఫ్యాన్ పేజీలు మరియు టీం తయారు చేసుకొని వెళ్తారు. అలాగే ప్రశాంత్ కూడా కొన్ని ఫ్యాన్స్ పేజీలు మరియు టీమ్ తయారు చేసుకున్నవిషయం తెలిసిందే.. అదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రశాంత్ ఫ్యాన్స్ మరియు అతని పీఆర్ టీం అమర్ దీప్ భార్య తేజస్విని ని ఒక రేంజ్ లో టార్గెట్ చేసారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి తేజస్విని పోస్టులను చూస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ మరియు అతని పీఆర్ టీం ఆ అమ్మాయిని ఏ రేంజ్ లో టార్గెట్ చేసారో అర్థం అవుతుంది.
పాపం అమర్ దీప్ (Amardeep) బయటకు వచ్చి ఆ కామెంట్స్ చూసాక చాలా బాధపడుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ పీఆర్ టీం ఏ రేంజ్ లో దిగజారిపోయింది అంటే తేజస్విని తన భర్త అమర్ దీప్ కి ఓటు వెయ్యండి అంటూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ని పల్లవి ప్రశాంత్ కి ఓటు వేయాల్సిందిగా ఆమె కోరినట్టు ఎడిట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.
ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో తేజస్విని కంట కూడా పడింది. గెలవడానికి ఇంత చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారా?, దమ్ముంటే నిజాయితితో గెలవండి అంటూ పల్లవి ప్రశాంత్ పీఆర్ టీం కి ఛాలెంజ్ చేసింది. కేవలం ఈ ఒక్క వీడియో విషయం లోనే కాదు, ఎన్నో విషయాల్లో తేజస్విని చాలా తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.