బిగ్ బాస్ కార్యక్రమంలో కంటే ముందుగా కొనసాగుతున్నటువంటి అమర్ టైటిల్ రేస్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా అమర్ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ వస్తున్నారు హౌస్ లో ఉన్నఫలంగా ఎమోషనల్ కావడం అలాగే అతిగా కొన్నిసార్లు రియాక్ట్ అవ్వడంతో ఈయన పట్ల విమర్శలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో అమర్ అమాయకత్వాన్ని చూసినటువంటి పలువురు తన భార్య తేజస్విని పై పలు పై కామెంట్లు చేస్తున్నారు.
ఇంత అమాయకుడితో ఎలా ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. వెంటనే తనకు విడాకులు ఇచ్చేయండి అంటూ చాలామంది అమర్ గురించి నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అమర్ గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి వారికి తన భార్య తేజస్విని కూడా అలాంటి సమాధానమే ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కామెంట్లపై తేజు స్పందిస్తూ మీరు నన్ను చూసి జాలి పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలియజేశారు.
నేను మా ఆయన చాలా సంతోషంగా ఉన్నామని ఎవరు మాకు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఎవరు నాపై జాలి పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్ తన ఫ్యామిలీ పట్ల చేసినటువంటి ట్రోల్స్ పై ఘాటుగా స్పందిస్తారు అంటూ మరికొందరు కామెంట్లు చేయగా ఈమె స్పందిస్తూ అమర్ (Amardeep) ఈ కామెంట్లపై రెచ్చిపోయి మాట్లాడాలి అంటే నేను తనని రెచ్చగొట్టాలి అలాంటి పని తాను చేయనని తెలిపారు.
చాలామంది ఈ కార్యక్రమాన్ని ఒక గేమ్ షో గా చూడకుండా వ్యక్తిగత విషయాల వరకు దీనిని తీసుకు వెళ్తున్నారని అలాంటివారు ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా కూడా దీని ప్రభావం అనుభవిస్తారు అంటూ ఈమె తన స్టైల్ లో నేటిజన్ లు చేస్తున్నటువంటి నెగటివ్ కామెంట్ల పై స్పందించారు.