Son Of India: ఆ ఓటీటీ ప్రేక్షకులకు వరుసగా షాకులిస్తోందా?
June 1, 2022 / 03:06 PM IST
|Follow Us
మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా సినిమాకు రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేని కథ, కథనంతో తెరకెక్కడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో సన్నాఫ్ ఇండియా అందుబాటులోకి రాగా ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఆదరణ దక్కలేదు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరగడం వల్ల ఈ సినిమాను చూడాలని భావించిన ప్రేక్షకులు సైతం వెనక్కు తగ్గారు.
భారతీయ ప్రేక్షకులకు ఉచితంగానే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే యూఎస్ ప్రేక్షకులు మాత్రం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడాలంటే డబ్బులు చెల్లించాలని సమాచారం. రెంట్ టు వాచ్ మోడల్ లో ఈ సినిమా యూఎస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండగా ఈ సినిమాను రెంట్ గా తీసుకొని చూడాలంటే 3 డాలర్లు చెల్లించాలని సమాచారం. ఎవరైనా రెంట్ గా కాకుండా సినిమాను కొనుగోలు చేయాలని భావిస్తే మాత్రం 10 డాలర్లు చెల్లించాలని బోగట్టా.
హిట్టైన సినిమాల కోసం డబ్బులు చెల్లించాలంటే ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు కానీ ఫ్లాప్ సినిమాలను చూడటానికి ఎందుకు ఆసక్తి చూపిస్తారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ నిర్ణయం వల్ల ఈ సినిమాను చూడాలని భావించే ప్రేక్షకులు సైతం వెనక్కు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓటీటీల నుంచి వరుస షాకులు తగులుతుండటంతో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు సబ్ స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడనుందని చెప్పవచ్చు.
భవిష్యత్తులో బ్లాక్ బస్టర్ హిట్టైన ప్రతి సినిమాను సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు సైతం ఓటీటీలో డబ్బులు చెల్లించి సినిమా చూసే పరిస్థితులు అయితే రావచ్చని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.