Bigg Boss: అమెజాన్ ప్రైమ్ సరికొత్త టెక్నిక్.. పాపం అన్నీ సోది సినిమాలే!
October 7, 2021 / 05:00 PM IST
|Follow Us
సినిమాలు కొనడంలో ఒక్కో ఒటీటీ సంస్థ, ఒక్కో రకమైన లాజిక్ ను ఫాలో అవుతూ ఉంటుంది. డిస్నీ హాట్ స్టార్ లాక్ డౌన్ టైంలో చనిపోయిన ఆర్టిస్టుల సినిమాలన్నీ కొనుగోలు చేసి సింపతీతోపాటు బోలెడన్ని సబ్ స్క్రిప్షన్లు క్యాష్ చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి చిత్రం “దిల్ బేచారా” పుణ్యమా అని డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ బేస్ ఒక్కసారిగా 10% పెరిగింది అంటే ఆషామాషీ కాదు. ఈ విషయంలో అమేజాన్ ప్రైమ్ మాత్రం ఎప్పటికప్పుడు బొక్కబోర్లా పడుతూనే ఉంది.
ఏదో మధ్యలో “ఆకాశమే నీ హద్దురా, సార్పట్ట” లాంటి సినిమాలతో సేవ్ అయ్యింది కానీ.. దాదాపుగా అమేజాన్ కొన్నవన్నీ డిజాస్టర్లే. అందువల్ల వాళ్ళకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఫాలో అవుతున్న కొత్త పంధా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సినిమాలు కొనడం. చిన్నాపెద్ద తేడా లేకుండా ఇప్పటివరకూ బిగ్ బాస్ లో పార్టీసిపెట్ చేసిన వాళ్లందరి సినిమాలు కొనేసింది అమెజాన్.అయితే.. వాటిలో దాదాపుగా అన్నీ రిలీజ్ కు నోచుకోని సినిమాలే.
తక్కువలోనే కొన్నప్పటికీ.. సదరు సినిమాలకు మినిమం వ్యూస్ కూడా రాకుండడంతో మళ్ళీ చతికిలపడింది టీం. తెలుగులో అమెజాన్ ప్రైమ్ కు ఎందుకో అచ్చిరాలేదనే చెప్పాలి. మరి ఇప్పటికైనా తమ పంధాను మార్చుకొని ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు కొంటే బాగుండు.