Amigos: అలా జరిగితే మాత్రమే అమిగోస్ బ్లాక్ బస్టర్ అవుతుందా?

  • February 8, 2023 / 03:58 PM IST

కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన అమిగోస్ మూవీ మరో 36 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్ కు జోడీగా ఈ సినిమాలో అషికా రంగనాథ్ నటిస్తుండగా బ్రహ్మాజీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. బుక్ మై షోలో రిలీజవుతున్న అన్ని థియేటర్లలో ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

పలు ప్రముఖ థియేటర్లలో ఈ సినిమాకు బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. కొన్ని జిల్లాలలో మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు బుకింగ్స్ మొదలుకాలేదు. బింబిసార స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకునే విషయంలో అమిగోస్ సక్సెస్ కాలేదు. అయితే టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అమిగోస్ టైటిల్ సినిమాకు కొంత మైనస్ అవుతోందని చాలామంది భావిస్తున్నాయి.

ఈ సినిమాను ప్రయోగాత్మక సినిమాగా ఫ్యాన్స్ ఫీలవుతుండగా సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ప్రేక్షకుల్లో ఆ అభిప్రాయం మారే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి కలెక్షన్లపై కొంతమేర ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేసి కళ్యాణ్ రామ్ సక్సెస్ సాధించాల్సి ఉంది.

అమిగోస్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అమిగోస్ సినిమాకు మైత్రీ నిర్మాతలు భారీ స్థాయిలోనే ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార2 సినిమాలో నటించే ఛాన్స్ అయితే ఉంది. కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus