Amigos Review in Telugu: అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 10, 2023 / 02:33 PM IST

Cast & Crew

  • కళ్యాణ్ రామ్ (Hero)
  • ఆశికా రంగనాథ్ (Heroine)
  • బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు (Cast)
  • రాజేంద్ర రెడ్డి (Director)
  • నవీన్ యెర్నేని, వై రవిశంకర్ (Producer)
  • జిబ్రాన్ (Music)
  • ఎస్. సౌందర్ రాజన్ (Cinematography)

“బింబిసారా” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా విడుదలవుతున్న తాజా చిత్రం “అమిగోస్”. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కళ్యాణ్ రామ్ “అమిగోస్”తో మరో హిట్ అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!


కథ: ప్రపంచంలో తనను పోలిన వారు ఎవరైనా ఉంటారా అని చాలా ఆశగా వెతుకుతుంటాడు సిద్ధార్ధ్ (కళ్యాణ్ రామ్). ఆ క్రమంలో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు డోపెల్ గ్యాంగర్స్ దొరుకుతారు. వాళ్ళే మంజునాధ్ & మైఖేల్ (రెండో & మూడో కళ్యాణ్ రామ్). ఈ ఇద్దరి సహాయంతో తాను ప్రేమిస్తున్న ఇషిక (ఆషికా రంగనాధ్)ను ప్రేమలో పడేయడమే కాక.. హీరోగా ఎలివేట్ అవుతాడు. కట్ చేస్తే..

మైఖేల్ అసలు ప్లాన్ వేరే ఉందని, ఆ ప్లాన్ వర్కవుటయితే ముగ్గురిలో ఒక్కరే ప్రాణాలతో ఉంటారని తెలుస్తుంది. అసలు మైఖేల్ ఎవరు? ఎందుకని సిద్ధార్ధ్ & మంజునాధ్ కు దగ్గరవుతాడు? వీళ్ళ ద్వారా ఏం సాధించాలనుకుంటాడు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే “అమిగోస్” చిత్రం.

నటీనటుల పనితీరు: ఒక్క టైటిల్స్ వచ్చేప్పుడు తప్ప ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ లోనూ కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. మూడు విభిన్న పాత్రల్లో అలరించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఓ మోస్తారుగా విజయం సాధించాడు కూడా. అయితే.. మైఖేల్ గానే ఎక్కువ హైలైట్ అయ్యాడు. మంజునాధ్ & సిద్ధార్ధ్ పాత్రలు రెగ్యులర్ గా ఉండడమే అందుకు కారణం.

ఆషికా రంగనాధ్ అందంగా కనిపించింది కానీ.. హావభావాల ప్రకటనలో మాత్రం మిన్నకుండిపోయింది. చాలా కీలకమైన సన్నివేశాల్లో కూడా ఎలాంటి ఎమోషన్స్ కనిపించకుండా సైలెంట్ గా నిల్చుండిపోయింది. బ్రహ్మాజీ కామెడీ అక్కడక్కడా వర్కవుటయ్యింది.


సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రాజేంద్ర రాసుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉండగా.. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తేలిపోయింది. ఆసక్తికరమైన కాన్సెప్ట్ కు అంతే ఆసక్తికరమైన కథనం చాలా ఇంపార్టెంట్. “అమిగోస్”లో అదే లోపించింది. ఆ కారణంగా ఎంతో ఆసక్తికరంగా మొదలైన సినిమా, చాలా నీరసంగా ముగుస్తుంది. సో, దర్శకుడు రాజేంద్ర రెడ్డి బొటాబోటి మార్కులతో పర్వాలేదనిపించుకున్నాడు.

కెమెరా, మ్యూజిక్, గ్రాఫిక్స్ & ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం రిచ్ గా ఉంది. అనవసరమైన సన్నివేశాలకు కూడా కాస్త ఎక్కువే ఖర్చు చేశారు.


విశ్లేషణ: సరైన స్క్రీన్ ప్లే & ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ & ఎమోషన్స్ ఉండి ఉంటే సూపర్ హిట్ గా నిలిచే సత్తా ఉన్న చిత్రం “అమిగోస్”. అయినప్పటికీ.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం అలరిస్తుందీ చిత్రం. నటుడిగా కళ్యాణ్ రామ్ మాత్రం నెగిటివ్ రోల్లో మరోసారి దుమ్ము దులిపాడు.


రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus