Amigos: బింబిసార బ్లాక్ బస్టర్ తో కళ్యాణ్ రామ్ రేంజ్ పెరిగిందా?

  • January 25, 2023 / 08:43 PM IST

గతేడాది బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో అమిగోస్ సినిమాలో నటించగా ఈ సినిమా ఫిబ్రవరి నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. వరుస విజయాలతో జోరుమీదున్న మైత్రీ నిర్మాతలు అమిగోస్ సినిమాను కూడా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

అమిగోస్ మూవీ రిలీజ్ సమయానికి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హవా పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నందమూరి హీరోల సినిమాలతో భారీగా లాభాలు వచ్చాయి.

ఈ బ్యానర్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి, జనతా గ్యారేజ్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి కూడా నిర్మాతలు మైత్రీ వాళ్లే కావడం గమనార్హం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఈ బ్యానర్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే డబ్బులు వెనక్కు ఇచ్చే మంచి నిర్మాతలు కావడంతో ఈ నిర్మాతలపై ఇండస్ట్రీలో మంచి ఒపీనియన్ ఉంది.

మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలను తీసి మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అమిగోస్ తో మైత్రీ బ్యానర్ లో మరో సక్సెస్ చేరుతుందేమో చూడాలి. బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ రేంజ్ పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus