బిగ్‌బాస్‌ 4 ఇంట్లో ఎలుకలకి కరాటే కళ్యాణికి సంబంధమేంటి?

  • September 7, 2020 / 05:14 PM IST

బిగ్‌బాస్‌ అంటేనే ఫన్‌. ఒకరి మీద ఒకరు జోకులేసుకోవడం, పంచ్‌లు విసురుకోవడం. అయితే తొలినాళ్లలో ఇది చాలా బాగుంటుంది. రోజులు గడిచే కొద్దీ, ఒక వీకెండ్‌ వచ్చి పోయేసరికి అవి సీరియస్‌ అవుతాయి. మరి ఈ వారం అప్పుడే అలాంటి పాయింట్‌ ఒకటి దొరికేసినట్లుంది. ఫైర్‌ బ్రాండ్‌ కరాటే కళ్యాణి మీద బిగ్‌బాస్‌ ఇంట్లో ఒక జోకు పేలింది. దీనికి కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ… ఇంట్లో వాళ్లు మాత్రం నవ్వుకున్నారు.

‘సాహో’లోని ‘సైకో సయ్యా… ’పాటకు డ్యాన్స్‌ వేస్తూ ఈ రోజును ప్రారంభించారు బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్స్‌. మాంచి మాస్‌ పాటకు హుషారైన స్టెప్పులు వేశారు. అందరూ అలా స్టెప్పులు వేసి వెళ్లారో లేదో లోపల కిచెన్‌లో సందడి మొదలైంది. ముందుగా అనుకున్నట్లే అమ్మరాజశేఖర్‌ మాస్టర్‌ వంట గదిలో గరిటె పట్టేశాడు. గుర్తుందిగా ఆయన శిష్యుడు బాబా భాస్కర్‌ గత సీజన్‌లో అదే పని చేశాడు. రాజశేఖర్‌ మాస్టర్‌కు సూర్యకిరణ్‌ తోడయ్యారు. కిచెన్‌ దగ్గర కూర్చోని ముచ్చట్లలో పడ్డారు.

‘ఆ సమయంలోనే ఓ జోక్‌ బ్లాస్ట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ ఇంట్లో ఎలుకలు ఉండేవి… ఇప్పుడు లేవు ఎందుకు’ అంటూ సూర్యకిరణ్‌ అడగగా… మిగిలిన వారు ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నించారు. దానికి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌… కరాటే కళ్యాణి వేసిన క్యాట్‌ వాక్‌ వల్ల అంటూ పంచ్‌ వేశారు. ఇప్పుడైతే అందరూ నవ్వుకున్నారు కానీ… తర్వాత ఏమవుతుందో చూడాలి. అన్నట్లు ప్రోమో ఆఖరున నైబర్‌ హౌస్‌లో ఉన్న సోహైల్‌.. హౌస్‌కి ఫోన్‌ చేశాడు. సుజాత్‌ ఫోన్‌ ఎత్తి హలో అంది. ఇది హలో వరకు ఆగిపోతుందా? లేక సోహైల్‌ ఏం చెబుతాడా అనేది చూడాలి.

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus