Amma Rajasekhar: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమ్మ రాజశేఖర్ ఈ 6 సినిమాలను డైరెక్ట్ చేసాడని మీకు తెలుసా?
February 16, 2022 / 05:51 PM IST
|Follow Us
టాలీవుడ్లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అమ్మ రాజశేఖర్ అటు తర్వాత ఓంకార్ ‘ఆట’ గేమ్ షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఆ షోలో ఆయన మైక్ పట్టుకునే విధానం.. కంటెస్టెంట్ ల పెర్ఫార్మన్స్ లను జడ్జి చేసే విధానం పై యూట్యూబ్ అంతగా పాపులర్ అవ్వని రోజుల్లో కూడా బోలెడన్ని మీమ్స్ వచ్చాయి.
అమ్మ రాజశేఖర్ ను ఇమిటేట్ చేస్తూ బోలెడన్ని స్పూఫ్ లు సైతం వచ్చేవి.అటు తర్వాత కొన్నాళ్ళపాటు అమ్మ రాజశేఖర్ కనిపించలేదు. అయితే 2020 లో జరిగిన ‘బిగ్ బాస్4’ లో అమ్మ రాజశేఖర్ కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.
ఎటువంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా హౌస్లో బాగానే కొనసాగారు అమ్మ రాజశేఖర్.అయితే ఈయన కొరియోగ్రాఫర్ కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రమే కాదు దర్శకుడు కూడా.ఈయన తన కెరీర్లో 6 సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. అందులో ఎన్ని హిట్ అయ్యాయో.. ఎన్ని ప్లాప్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :
1) రణం :
గోపిచంద్ హీరోగా కామ్నాజఠ్మలానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘అయ్యప్పనమ్ కోషియమ్’ ఫేమ్ బీజూ మీనన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది మన అమ్మ రాజశేఖర్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. బీజూ మీనన్ పాత్రనే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ లో పోషిస్తున్నాడు.
2) ఖతర్నాక్ :
‘రణం’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రవితేజ.. అమ్మ రాజశేఖర్ ను పిలిచి మరీ ‘ఖతర్నాక్’ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో ఇలియానా గ్లామర్ షో ఓ రేంజ్లో ఉంటుంది.
3) టక్కరి :
నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రమిది. ఇది కూడా డిజాస్టరే..!
4) భీభత్సం :
2009లో శశాంక్, మధుశర్మలను లీడ్ రోల్స్ గా పెట్టి అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రం పర్వాలేదు అనే విధంగా అయితే ఆడింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.
5) మ్యాంగో :
2013లో కృష్ణుడు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.
6) రణం 2 :
తనకి హిట్ ఇచ్చిన ‘రణం’ క్రేజ్ ను వాడుకోవాలని అమ్మ రాజశేఖర్ చేసిన ప్రయత్నం ఈ మూవీ. తాను దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటించి మరో అట్టర్ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత మళ్ళీ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వైపు చూడలేదు.