Ammadi Song: వైరల్ అవుతున్న డెత్తడి హారిక క్యూట్ రొమాంటిక్ సాంగ్

  • August 29, 2021 / 12:32 PM IST

తన అసలు పేరు అలేఖ్య హారిక, అయినప్పటికీ ఆమె పేరు అందరికీ దేత్తడి హారిక గానే తెలుసు. ఎందుకంటే మొదటి నుండి తనదైన హావభావాలతో డెత్తడి కాన్సెప్ట్ లతో ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేసింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి కొంచెంకొంచెంగా యూట్యూబ్ లో తన స్థాయిని పెంచుకుంది. ఇక స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన హారిక కి ఆ షో ద్వారా కూడా బాగానే క్రేజ్ అందుకుంది.

అయితే ఆ షో అనంతరం మళ్ళి తన న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన హారిక ప్రస్తుతం దేత్తడి ఛానల్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో సాంగ్ వైరల్ గా మారింది. అమ్మాడి అంటూ నేటి యువత మనోభావాలకు అద్దం పట్టేలా నిలిచింది. తొలిరోజు కోచింగ్ సెంటర్ కి అటెండ్ అయ్యే యువత మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఆ తరువాత వారి జీవితాలు ఏ విధంగా ఆలోచనలు చేస్తాయి అనే భావనలకు దృశ్యరూపకంగా తెరకెక్కిందే ఈ అమ్మాడి వీడియో సాంగ్. వినయ్ షణ్ముఖ్ దర్శకత్వంలో తెరక్కిన ఈ షార్ట్ ఫిలిం వీడియో సాంగ్ లో దేత్తడి హారిక, విజయ్ విక్రాంత్ యాక్ట్ చేసారు.

తొలిసారి యువతీ యువకుల మనస్సులో పుట్టే ప్రేమ, అది చేసే అల్లరి, ఆ సమయంలో ప్రేయసి ప్రియుల ఆలోచనలు, తద్వారా వారిద్దరూ కలిసి చేసే సందడుల మేళవింపుగా ఈ సాంగ్ తెరకెక్కింది. ఇక ఈ సాంగ్ లో విజువల్స్, ఫోటోగ్రఫీ, మరీ ముఖ్యంగా సురేష్ బానిసెట్టి అందించిన లిరిక్స్ అలానే విజయ్ బుల్గన్ సంగీతం అదిరిపోయాయి అనే చెప్పాలి. ఇక సాంగ్ లో హారిక, విక్రాంత్ ఇద్దరూ కూడా తమ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. అందమైన పదాలతో హ్రద్యమైన సంగీతంతో ముఖ్యంగా యువత మనసుకి దగ్గరగా ఉంది ఈ సాంగ్. మొత్తంగా ఈ అమ్మాడి సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ దక్కించుకుంటూ కొనసాగుతోంది.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus