డైరెక్టర్ గా నెట్టింట్లోకి వస్తున్న మొదటి తెలుగు సినిమా
April 25, 2020 / 12:35 PM IST
|Follow Us
కరోనా వైరస్ గుప్పెట్లో ప్రపంచం వణుకుతున్న వేళ లోకం మొత్తం స్థంభించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు మూతపడగా అనేక మంది కార్మికులు నిరాశ్రయులు అయ్యారు. ఇక చిత్ర పరిశ్రమ సైతం పూర్తిగా దెబ్బతింది. కొత్త సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో రోజువారీ సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. థియేటర్స్ బంధ్ కావడంతో పూర్తయిన చిత్రాల విడుదల ఆగిపోయింది. దీనితో కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన చిత్రాలు బాక్సులకే పరిమితం అవుతున్నాయి. పెట్టుబడి స్థంభించిపోవడంతో నిర్మాతలు నష్టాల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది.
దిల్ రాజు వంటి బడా నిర్మాత వి, వకీల్ సాబ్ చిత్రాలు నిర్మించారు. ఈ రెండు చిత్రాలు బడ్జెట్ దాదాపు వంద కోట్ల పైమాటే. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాలు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి. కాగా కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో మొదటి చిత్రంగా నిలిచింది అమృతా రామమ్. అమెరికా నేపథ్యంలో సాగే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అమృతా రామమ్ డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటైన జీ 5లో విడుదల చేస్తున్నారు.
ఈనెల 29 నుండి ఈ సినిమా జీ5 ఆప్ లో అందుబాటులో ఉండనుంది. రామ్, అమిత ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం సురేందర్ కె దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఇప్పటికే పూర్తయి.. విడుదల కాని అనేక చిన్న సినిమాలు ఈ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.