అమ్మడికి ఈ సినిమా అయినా కలిసొస్తుందా!

  • May 28, 2018 / 12:17 PM IST

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంటుంది కొందరు కథానాయికల పరిస్థితి. అందం, అభినయ సామర్ధ్యం, ముద్దు సీన్లు మొదలుకొని బికినీ షాట్స్ వరకూ దేనికీ తగ్గని అడ్డుచెప్పని దాతృత్వం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు హీరోయిన్ గా సరైన హిట్ ఒక్కటి కూడా లేకపోవడంతో.. ఇప్పటికీ సినిమా హిట్ అయితే బాగుండు అని పూజలు చేసే పొజిషన్ లోనే ఉండిపోయింది అమైరా దస్తూర్. ఈ మోడల్ టర్నడ్ హీరోయిన్ ఇప్పటివరకూ ఓ ఏడెనిమిది సినిమాల్లో నటించింది. ప్రతి సినిమాలోనూ ఈమె నటనని, అందానికి మంచి పేరు వచ్చినప్పటికీ.. ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో కమర్షియల్ హీరోయిన్ మాత్రం అవ్వలేకపోయింది.

అందుకే.. తన ఆశాలన్నీ “రాజుగాడు” సినిమా మీద పెట్టుకొంది. వర్మ శిష్యురాలు సంజానారెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ టైటిల్ పాత్ర పోషించగా “భలే భలే మగాడివోయ్, మహానుభావుడు” తరహాలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కామెడీ సినిమాగా రూపొందింది ఈ చిత్రం. ఈ చిత్రంపై రాజ్ తరుణ్, సంజానారెడ్డిల కంటే ఎక్కువగా అమైరా దస్తూర్ కి ఈ చిత్రం కీలకం కానుంది. మరి ఈ సినిమా విజయం సాధించి అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus