Suriya: సూర్య బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ విషయాలు తెలుసా?
July 23, 2024 / 09:26 PM IST
|Follow Us
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సూర్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సూర్య ఈ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే సూర్య హీరో కావడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. జులై నెల 23వ తేదీ సూర్య పుట్టినరోజు కాగా సూర్యకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య అసలు పేరు శరవణన్ కాగా డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) శరవణన్ పేరును సూర్యగా మార్చారు. తండ్రి శివకుమార్ ( హీరో అయినా సూర్య మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. సూర్య డిగ్రీ పూర్తి చేసే సమయానికి సూర్య తండ్రి హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు ఒక గార్మెంట్ కంపెనీలో పని చేసిన సూర్య రెండు నెలలకు 1200 రూపాయల వేతనం అందుకున్నారు. అప్పులు తీర్చాలనే ఆలోచనతో సూర్య సినిమాల్లోకి వచ్చారు.
సూర్య కెరీర్ తొలినాళ్లలో నటించడానికి ఎంతో ఇబ్బంది పడటంతో “వీళ్ల నాన్న ఎంత గొప్ప నటుడో.. ఇతనంత వేస్ట్ పెలో” అని విమర్శలు వ్యక్తమయ్యాయి. నటుడు రఘువరన్ ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బ్రతుకుతావ్ అని చేసిన కామెంట్లతో సూర్య నటనపై ఫోకస్ పెట్టారు. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్య కావడం గమనార్హం.
అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య పేద పిల్లలను చదివిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్య నటనకు ఎన్నో అవార్డులు రాగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సూర్య కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.