Srini Josyula, Harsha Narra: ‘మిస్సింగ్’ మూవీ హీరో, డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
November 17, 2021 / 05:53 PM IST
|Follow Us
‘బజరంగబలి క్రియేషన్స్’ బ్యానర్ పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మాణంలో శ్రీని జోస్యుల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిస్సింగ్’. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ‘మిస్సింగ్’ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకురానుంది.’గీతా ఆర్ట్స్’ ‘ఏషియన్ సినిమాస్’ వంటి బడా సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా… ఈ చిత్రం హీరో, దర్శకుడు ఇద్దరూ ప్రేక్షకులు కొత్తే అయినప్పటికీ ఇండస్ట్రీకి కొత్త కాదు. వాళ్ళ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం :
ముందుగా హీరో హర్ష నర్రా విషయానికి వస్తే.. అతను దీక్షిత్ మాస్టర్ వద్ద యాక్టింగ్ కోర్సు చేసాడు. నాగేశ్వరరావుగారి దగ్గర మెడల్ కూడా అందుకున్నాడు.చిన్నప్పటి నుండీ యాక్టర్ అవ్వాలనేది అతని కల.సినీ పరిశ్రమలో అతనికి ఎటువంటి బ్యాక్ గ్రాండ్ లేదు.. అందుకే ముందు చదువు పూర్తిచేసుకుని యాక్టింగ్ వైపు వచ్చాడు. ‘ఆకాశమంత ప్రేమ’ అనే షార్ట్ ఫిలిం ద్వారా కెరీర్ ను మొదలుపెట్టాడు. నిహారిక కొణిదెల రూపొందించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’ అలాగే ‘పెళ్లి గోల3’ వంటి వెబ్ సిరీస్ లతో ఇతను మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ టైములో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్న శ్రీని జోస్యుల… ఓ హీరో కోసం గాలిస్తున్నాడు. అప్పుడు హర్ష కలవడం… తన ‘మిస్సింగ్’ కథకి ఇతను కరెక్ట్ గా సరిపోతాడని భావించి ఇతన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది.
దర్శకుడు శ్రీని జోస్యుల విషయానికి వస్తే.. ఇతను మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఆ చిత్రం నిర్మాతలైన ‘గీతా ఆర్ట్స్’ వారి వద్ద మరికొన్ని హిట్ సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసాడు.తనకి సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు.బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ప్యాషన్ తో ఈ స్థాయికి వచ్చాడు. ‘కొత్త వాళ్లను ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ‘మిస్సింగ్’ చిత్రంతో మంచి ఫలితాన్ని అందుకుంటాము. మా మూవీలో ఎలాంటి వల్గారిటీ లేదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీ ఇది’.. అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.