KGF 2: ‘కె.జి.ఎఫ్ 2’ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • June 1, 2021 / 12:27 PM IST

ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కె.జి.ఎఫ్ 2′ కూడా ఒకటి. ఓ విధంగా థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే స్టామినా..’ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్2’ వంటి సినిమాలకే ఉన్నాయని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు మాత్రమే కాదు మేకర్స్ కూడా అదే భావిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ ఎలాగు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. కానీ ‘కే.జి.ఎఫ్2’ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి.. ముందుగా ఈ సినిమానే విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ‘కె.జి.ఎఫ్ 2’ టీం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.

మొన్నటికి మొన్న రావు రమేష్ పుట్టినరోజు నాడు అతని పాత్రని రివీల్ చేస్తూ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ‘ఇనాయత్ ఖలీల్’ అనే కీలక పాత్ర పోషిస్తున్న నటుడు బాలకృష్ణ పాత్రను రివీల్ చేస్తూ ఓ అప్డేట్ ఇచ్చారు. అతి పెద్ద సామ్రాజ్యం అయిన నారాచిని ఆక్రమించడానికి ఇనాయత్ ఖలీల్ ఎవరితో చేతులు కలిపాడు? అదే విధంగా తన పుట్టినరోజు వేడుకని భారతదేశంలో ఎవ్వరికీ తెలియని ప్లేస్ లో జరుపుకుంటున్నాడు.

అదిఎక్కడ ? అంటూ ఓ న్యూస్ పేపర్లో వార్త ప్రచురించినట్టు చేశారు. మొన్న రావు రమేష్ పుట్టినరోజున కూడా ఇదే విధంగా అప్డేట్ ఇచ్చారు. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, ఈశ్వరి రావు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో యష్ ను ఢీకొట్టే విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus