ఆ సూపర్ హిట్ చిత్రాన్ని నాగ చైతన్య ఎందుకు రిజెక్ట్ చేసాడంటే?
June 21, 2020 / 03:40 PM IST
|Follow Us
2009 సెప్టెంబర్ 5న విడుదలైన ‘జోష్’ చిత్రంతో నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వాసు వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. నాగార్జున కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నారు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. ‘ఎంతో వెయిట్ ఉన్న పాత్రను ఏమాత్రం అనుభవం లేని నాగ చైతన్య పై పెట్టారు. ఆ పాత్రకు నాగ చైతన్య న్యాయం చెయ్యలేకపోయాడు’ అనే విమర్శలు ఎదుర్కొన్నాడు చైతన్య.
అయితే నాగ చైతన్యను లాంచ్ చేసే బాధ్యతను నాగార్జున.. దిల్ రాజుకే అప్పగించారు. అందులో భాగంగా దిల్ రాజు.. ‘కొత్త బంగారులోకం’ అనే సూపర్ హిట్ కథను నాగార్జునకు అలాగే నాగ చైతన్యకు వినిపించమని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను పంపాడట. అప్పుడు ఎలాగూ చైతన్యకు కథ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. నాగార్జున వంటి స్టార్ హీరో వారసుడుగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు.. ఆయన ఏ కథ రిఫర్ చేస్తే అదే ప్రిఫర్ చెయ్యాలి. దాంతో నాగార్జున ‘నా కొడుకుని లాంచ్ చేసే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి.
‘కొత్త బంగారు లోకం’ మరీ క్లాస్ గా, ఫ్లాట్ గా ఉంది అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు చెప్పి ఆ చిత్రాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశారట. చైతన్య కూడా తండ్రి మాటకే ఓకే చెప్పాడట. దీంతో కొద్ది రోజుల తరువాత దిల్ రాజు.. ‘జోష్’ స్క్రిప్ట్ వినిపించమని ఆ చిత్రం దర్శకుడు వాసు వర్మను పంపినట్టు తెలుస్తుంది. ‘జోష్’ కథ పరంగా ఎట్రాక్టివ్ గానే ఉంటుంది.అందుకే నాగార్జున ఓకే చెప్పేశారు. కానీ అంతే ఎట్రాక్టివ్ గా కథనం మాత్రం దర్శకుడు వాసు వర్మ నడపలేకపోయాడు. ఆ రకంగా చూసుకుంటే.. ‘ ‘కొత్త బంగారు లోకం’ అనే క్లాస్ మూవీనే చైతూతో చెయ్యించాల్సింది’ అని అప్పుడు చాలా మంది అభిప్రాయపడ్డారు.