ఆడియో వేడుకల్లో వచ్చిన మార్పుల గురించి భలే సరదాగా చెప్పాడు
January 30, 2020 / 12:11 PM IST
|Follow Us
అనంత్ శ్రీరామ్ అనే పేరు తెలియని సినిమా ప్రేమికుడు ఉండడు. ఆయన రాసిన పాటలు అలాంటివి మరి. డబ్బింగ్ సాంగ్స్ కూడా సంతోషంగా వినొచ్చు అని ప్రూవ్ చేసిన యంగ్ రైటర్స్ లో అనంత్ శ్రీరామ్ ఒకరు. చూడ్డానికి సన్నగా సున్నితంగా ఉంటాడు కానీ.. శ్రీరామ్ ఒక్కోసారి వేసే సెటైర్స్ చాలా గట్టిగా పేలుతుంటాయి. ఎలక్షన్స్ తర్వాత ఓటర్స్ గురించి అనంత్ శ్రీరామ్ పాడిన ఒక పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ ఇండస్ట్రీ పోకడ గురించి సెటైర్స్ వేశారు.
“ఇదివరకు ఆడియో ఫంక్షన్స్ లో క్యాసెట్స్ ఇచ్చేవారు.. అవి కారులో లేదా ఇంట్లో ప్లే చేసుకునేవాళ్ళం, కొన్నాళ్ళ తర్వాత ఖాళీ సీడీ కవర్ లు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇమ్మనేవారు, కొన్నాళ్ళకి ఫంక్షన్స్ లో ప్లాటినం డిస్క్ షీల్డ్స్ & బొకేలు ఇచ్చి.. మేం స్టేజ్ దిగేలోపు మళ్ళీ తీసేసుకొనేవారు. ఇవాళ చాన్నాళ్లకి రాజ్ కందుకూరి గారు షీల్డ్స్ ఇస్తుంటే.. ఇది ఉంచుకోవచ్చా” అని అడిగాను అంటూ గత 15 ఏళ్లల్లో ఇండస్ట్రీ వ్యవహారశైలిలో వచ్చిన మార్పులను చాలా సింపుల్ గా సెటైరికల్ గా చెప్పేశాడు అనంత్ శ్రీరామ్